: క్యాబినెట్ ఆమోదం... ఓబీసీ జాబితాలో చేరిన నాలుగు కులాలు
ఇతర వెనుకబడిన కులాలు (అదర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ - ఓబీసీ) జాబితాలో నాలుగు కులాలను చేరుస్తూ, కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్ రాష్ట్రంలోని సిపాయ్, పట్ని జామత్, తుర్క్ జామత్ కులాలను (ఈ మూడూ ముస్లిం ఉపకులాలు), ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కహార్ మరియు తన్వార్ కులాలను ఓబీసీల జాబితాలో చేరుస్తున్నట్టు ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం కాగా, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ సిఫార్సులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కులాల వారికి ఇతర ఓబీసీ జాబితాల్లోని వారికి లభించే అన్ని రిజర్వేషన్లు దగ్గరవుతాయని కేంద్రం ఓ ప్రకటనలో వెలువరించింది.