: యూఎస్ కాన్సులేట్ ను మోసం చేయబోయిన కేరళ నటి నీతూ కృష్ణ అరెస్ట్
తప్పుడు పత్రాలు సమర్పించి యూఎస్ కాన్సులేట్ ను మోసం చేయడంతో పాటు, దొంగదారిలో అమెరికా వెళ్లాలని ప్రయత్నించిన మలయాళ నటి నీతూ కృష్ణ వాసు (28)ను కాన్సులేట్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో భాగంగా తాను మోసపోయినట్టు నీతూ కృష్ణ చెప్పినట్టు సమాచారం. అమెరికా వెళ్లి వివాహాల కార్యక్రమాల్లో నృత్యాలు చేస్తే అధికంగా డబ్బు సంపాదించవచ్చని నిర్మాత రాజి తనను సంప్రదించాడని ఆమె చెబుతోంది. చెన్నై వెళ్లి వీసా తీసుకోవాలంటే రూ. 2 లక్షలు అవుతుందని చెబితే, తాను ఆ డబ్బు ఇచ్చానని, తనకు ఇలా తప్పుడు పత్రాలిచ్చి మోసం చేస్తాడని అనుకోలేదని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిర్మాతలు రాజి, బ్రోకర్ కుంజుమోన్ ల కోసం గాలిస్తున్నట్టు తెలియజేశారు.