: భారత క్రికెట్ గణాంక నిపుణుల సంఘం అధ్యక్షుడిగా వెంగ్ సర్కార్ ఏకగ్రీవం


భారత క్రికెట్ గణాంక నిపుణులు, స్కోరర్ల సంఘం (ఏసీఎస్ఎస్ఐ) అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా దారా పోచ్ఖాన్ వాలా, గణేశ్ అయ్యర్ ఎన్నికయ్యారు. గత వారం ముంబయిలో జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ మేరకు ఏసీఎస్ఎస్ఐ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కార్యదర్శిగా థియో బ్రగాంజా, సంయుక్త కార్యదర్శిగా దీపక్ జోషి, కోశాధికారిగా అజిత్ దతార్ ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News