: ఎలుకల దాడిలో శిశువు మృతిపై దిగ్భ్రాంతి చెందిన మంత్రులు


గుంటూరు జీజీహెచ్ లో ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాసరావు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు తనిఖీలు నిర్వహించారు. ఎలుకల దాడిలో శిశువు మరణించిన ఘటన గురించి తెలుసుకున్న మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది, అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. వార్డులను తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆసుపత్రిలో ఓ మహిళ మగబిడ్డకు జన్మనివ్వగా, రాత్రివేళ ఎలుకలు ఆ శిశువును పీక్కుతినడం ప్రారంభించాయి. పసికందు ఏడుపు విని తల్లి నిద్ర లేచే లోపే ఆ ఎలుకలు తీవ్రగాయాలు చేశాయి. దాంతో, చికిత్స పొందుతూ ఆ శిశువు మృతి చెందాడు.

  • Loading...

More Telugu News