: ప్రపంచంలో పేరెన్నికగన్న రైల్ రోడ్ స్టేషన్ మాస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన 'పిల్లిగారు'!
జపాన్ లోని రైల్ రోడ్ స్టేషన్ కి ప్రపంచంలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకు కారణం ఓ పిల్లి. 2007లో స్టేషన్ మాస్టర్ గా విధులు నిర్వర్తించిన స్టేషన్ మాస్టర్... టామా అనే పిల్లిని పెంచుకునేవారు. రైల్ రోడ్ స్టేషన్ కి వచ్చిపోయేవారితో ఆ పిల్లి చాలా సరదాగా ఉండేది. దీంతో ఈ పిల్లిని చూడడానికే చాలామంది ఆ స్టేషన్ కు వచ్చేవారు. దీంతో అధికారులు టామానే స్టేషన్ మాస్టర్ గా నియమించారు. ఇటీవల టామా అనారోగ్యం కారణంగా మృతి చెందింది. దీంతో అధికారులు మరో పిల్లిని స్టేషన్ మాస్టర్ చేయాలని భావించారు. దీంతో నిటామా అనే పిల్లిని తీసుకొచ్చి రైల్ రోడ్ స్టేషన్ కు స్టేషన్ మాస్టర్ ని చేశారు. నిటామాకు నేడు బాధ్యతలు అప్పగించారు. టామాలా ప్రయాణికులతో నిటామా కూడా సరదాగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.