: జర్నలిస్టు ఉద్యోగం ఊడగొట్టిన అనుకరణ!


అనుకరణ అనేది ఎంతటి రిస్కో ఇప్పుడు ఓ జర్నలిస్టుకి అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. పైపెచ్చు ఆ సరదా చేస్తున్న ఉద్యోగాన్ని కూడా ఊడగొట్టింది. వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన మాక్స్ నాబ్లాచ్ ఓ స్థానిక పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. బ్రిటన్ రాకుమారుడు జార్జ్ కు సదరు జర్నలిస్టు వీరాభిమాని. అభిమానం శృతిమించడంతో జార్జ్ వేసుకున్న దుస్తులను ధరిస్తూ, ప్రిన్స్ లా ఫీలవుతుంటాడు. ఇలా వారం రోజుల పాటు నాబ్లాచ్ ప్రిన్స్ జార్జ్ ను పోలిన దుస్తులు ధరించి విధులకు హాజరయ్యాడు. దీంతో పత్రిక యాజమాన్యం అతనిని రెండు నెలలపాటు విధుల నుంచి తప్పించినట్టు తెలిపింది. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాకెక్కింది. ప్రిన్స్ జార్జ్ ధరించిన దుస్తులు ధరించి దిగిన ఫోటోలకు నెటిజన్ల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఉద్యోగం పోతే పోయింది కానీ, మంచి గుర్తింపు లభించిందని నాబ్లాచ్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News