: ఎమ్మెల్యే కిష్టారెడ్డి అంత్యక్రియలు పూర్తి
మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఆయన స్వగ్రామం పంచగామలో అధికారిక లాంఛనలతో జరిగాయి. చివరిగా ఆయనను చూసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అంతేగాక సీఎం కేసీఆర్, ఆయన మంత్రివర్గ సహచరులు, కాంగ్రెస్ నేతలు హాజరై కిష్టారెడ్డి పార్థివదేహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఆయన పెద్ద కుమారుడు సంజీవరెడ్డి చితికి నిప్పంటించారు.