: కొత్త కాంబినేషన్ ప్రయత్నిస్తున్న కోహ్లీ
ఓపెనర్ మురళీ విజయ్ గాయపడడంతో చివరి టెస్టులో కొత్త ఓపెనింగ్ కాంబినేషన్ ను బరిలో దింపాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ భావిస్తున్నాడు. విజయ్ స్థానంలో ఛటేశ్వర్ పుజారాను ఓపెనర్ గా పంపాలని నిర్ణయించుకున్నట్టు కోహ్లీ తెలిపాడు. ఓపెనింగ్ చేయాలని పుజారాను అడిగామంటే, అందుకు కారణం జట్టు అవసరాలేనని స్పష్టం చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభించేందుకు పుజారా ఎంతో సంతోషిస్తున్నాడని చెప్పాడు. సహచరుల్లోనూ, మేనేజ్ మెంట్ పరంగానూ ఇలాంటి నమ్మకాన్నే తాము కోరుకుంటున్నామని తెలిపాడు. ఏ నిర్ణయం తీసుకున్నా అది జట్టు ప్రయోజనాల కోసమేనని కోహ్లీ పేర్కొన్నాడు. ఒకరి కోసం మరొకరిని జట్టులోంచి తీసేసినా, ఒకరి స్థానంలో మరొకరిని బ్యాటింగ్ కు పంపినా, అదంతా టెస్టు గెలిచేందుకేనని వివరించాడు.