: సమాధిలో జీవించి, మరణించిన యువతి!


కొన్నిసార్లు ఊహకందని ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. అలాంటి ఘటనే అమెరికాలోని హోండూరస్ లో జరిగింది. నేసీ (16) అనే యువతికి రూడీ అనే వ్యక్తితో వివాహం జరిగి, గర్భం దాల్చింది. కొన్నాళ్లకి అనారోగ్యం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, నేసీ మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సంప్రదాయపద్ధతిలో శవపేటికలో పెట్టి ఖననం చేశారు. పైన సిమెంట్ తో సమాధి కూడా కట్టారు. మరుసటి రోజు సమాధిని సందర్శించిన సందర్భంగా నేసీ భర్త రూడీకి సమాధిలోంచి కేకలు, ఏవో శబ్దాలు వినిపించడంతో బంధువులకు సమాచారం అందించాడు. దీంతో వారు వచ్చి సమాధిని పెకలించి చూడగా, శవపేటిక గాజు అద్దం పగిలి ఉంది, నేసీ చేతికి గాయాలయ్యాయి. దీంతో నేసీ బతికే ఉందని భావించి ఆసుపత్రికి తరలించగా, ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందిందని నిర్ధారించారు. ఈసారి ఊపిరాడక చనిపోయిందని తెలిపారు. తొలుత ఆమె గుండె తాత్కాలికంగా ఆగిపోయి ఉంటుందని, అందుకే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారని వారు అభిప్రాయపడ్డారు. దీంతో చేసేదేమీ లేక ఆమె కుటుంబ సభ్యులు మరోసారి అదే సమాధిలో నేసీ మృతదేహాన్ని ఖననం చేశారు.

  • Loading...

More Telugu News