: జగన్ ఎంత నిరాశ, నిస్పృహలో ఉన్నారో అర్థమవుతోంది: దేవినేని ఉమ


వైకాపా అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డంగా దోపిడీ చేసిన జగనా, చంద్రబాబు గురించి మాట్లాడేది? అంటూ మండిపడ్డారు. 'లక్ష కోట్ల' కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లే జగన్ కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదని అన్నారు. రాష్ట్రాన్ని పాలించేందుకు జగన్ పనికిరాడని ప్రజలు ఇప్పటికే తేల్చేశారని ఎద్దేవా చేశారు. రెండు రోజుల పాటు ధర్నా చేపడితే జనాలు రారన్న బాధతో ఒక రోజు ధర్నా చేపట్టారని... అయినప్పటికీ జనాలు రాకపోవడంతో జగన్ సహనం కోల్పోయారని అన్నారు. జగన్ ఎంత నిరాశ, నిస్పృహలో ఉన్నారో అర్థమవుతోందని చెప్పారు.

  • Loading...

More Telugu News