: నానిది సినిమా పాత్రే...నాది మాత్రం జీవితం: రాజమౌళి


మారుతి దర్శకత్వంలో నాని, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన 'భలే భలే మగాడివోయ్' సినిమా ట్రైలర్ పై ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. సినిమా ట్రైలర్ అద్భుతమని ఆయన పేర్కొన్నారు. ట్రైలర్ అంటే ఇలా ఉండాలని రాజమౌళి అభిప్రాయపడ్డాడు. సినిమాలో మతిమరుపు వ్యక్తి పాత్రను నాని పోషిస్తుండగా, నిజ జీవితంలో ఆ పాత్రను తాను పోషిస్తున్నానని రాజమౌళి చమత్కరించాడు. తమ కుటుంబంలో తానో పెద్ద 'బ్రాండెడ్ గజినీ'నని రాజమౌళి చెప్పాడు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

  • Loading...

More Telugu News