: పటేళ్ల పోరాటానికి లాలూ మద్దతు... తామూ పోరాడతామని హామీ


ఓబీసీ స్థాయి, రిజర్వేషన్లు కోరుతూ ఆహ్మదాబాద్ లో రెండు రోజులుగా పటేల్ సామాజిక వర్గం చేస్తున్న ఆందోళనకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పూర్తి మద్దతు తెలిపారు. గుజరాత్ కు చెందిన పటేళ్లు చేస్తున్న డిమాండ్ న్యాయమైనదే అని అన్నారు. అయితే వెనుకబడిన తరగతుల వారికి, సామాజిక న్యాయానికి బీజేపీ వ్యతిరేకమని ఆరోపించారు. పటేళ్లకు అండగా తామున్నామని, వారిని ఓబీసీలో చేర్చేందుకు వారి తరపున ఆర్జేడీ కూడా పోరాటం చేస్తుందని లాలూ తెలిపారు.

  • Loading...

More Telugu News