: కేరళలో రెండు పడవలు ఢీ, 8 మంది మృతి


కేరళలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న పడవను మత్స్యకారులు వెళ్తున్న పడవ ఢీకొంది. ఈ ఘటన కొచ్చిలో జరిగింది. ప్రయాణికుల పడవ ఫెర్రీ పోర్ట్ నుంచి వ్యాపిన్ వెళుతుండగా, మార్గమధ్యంలో అదుపుతప్పిన మత్స్యకారుల పడవ ఒకటి బలంగా ఢీకొన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల పడవ రెండుగా చీలిపోగా, నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా 8 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో 45 మంది వరకూ ప్రయాణికులు పడవలో ఉన్నారు. ప్రమాదం గురించిన సమాచారాన్ని తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News