: మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఖాళీ చేసిన ఛాంబర్ డీఎస్ కు ఇచ్చారు


టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ కొన్ని రోజుల కిందట తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు ప్రభుత్వం ఛాంబర్ కేటాయించింది. తెలంగాణ సచివాలయంలోని డీ బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న పేషీని డీఎస్ కు ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం తప్పించిన మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ప్రస్తుతం డీఎస్ కు కేటాయించిన ఛాంబర్ నుంచే విధులు నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి డీఎస్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా బాధ్యతలు స్వీకరిస్తారు.

  • Loading...

More Telugu News