: గొడవలు ఎప్పుడూ ఉండేవే... భారత్-పాక్ సిరీస్ పై ఆశలు వదులుకోని పీసీబీ


టెర్రరిజం, సరిహద్దు కాల్పులు, దావూద్ ఇబ్రహీంకు ఆశ్రయం... తదితర అంశాల కారణంగా పాకిస్థాన్ తీరును భారత్ ఎన్నోమార్లు తప్పుబట్టింది. అయినా తానేమీ తప్పు చేయలేదంటూ పాక్ బుకాయించడం సర్వసాధారణంగా మారింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న అనిశ్చితి క్రికెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. డిసెంబర్ లో దాయాదుల మధ్య క్రికెట్ సమరం జరగాల్సి ఉంది. అయితే, ఉధంపూర్ ఘటనకు తోడు, దావూద్ పాక్ లోనే ఆశ్రయం పొందుతున్నాడన్న విషయం తెలియడంతో సిరీస్ నిర్వహణపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ సిరీస్ జరుగుతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దీనిపై వచ్చే నెలలో స్పష్టత వస్తుందని పీసీబీ ప్రముఖుడు నజామ్ సేథీ అంటున్నారు. "భారత రాజకీయనేతలు చేసే ప్రకటనలను కానీ, మీడియాలో వచ్చే కథనాలను కానీ తీవ్రంగా పరిగణించాల్సిన పనిలేదు. భారత్, పాక్ మధ్య ఇలాంటి గొడవలు ఎప్పుడూ ఉండేవే. సిరీస్ రద్దు చేయాల్సి వచ్చేంత తీవ్రస్థాయిలో పరిస్థితేమీ లేదు. సెప్టెంబరులో న్యూయార్క్ లో జరిగే ఐరాస సమావేశాల సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు, ఇతర అధికారులు చర్చలు జరిపే అవకాశాలున్నాయి. ఆ సందర్భంగా వాతావరణం తేలికపడుతుందని భావిస్తున్నాం" అని తెలిపారు.

  • Loading...

More Telugu News