: త్వరలో జగన్ కు జైలు తప్పదు: గాలి
ఆంధ్రప్రదేశ్ కు రాజధానిని నిర్మించరాదని వైకాపా అధినేత జగన్ కోరుకుంటున్నారా? అని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రశ్నించారు. ధర్నాలతో ప్రజలను రెచ్చగొడుతున్న జగన్... రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటే చరిత్ర హీనులవుతారని అన్నారు. ఇప్పటికే జైలుకు వెళ్లివచ్చిన జగన్ కు మళ్లీ జైలు తప్పదని గాలి జోస్యం చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని... ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.