: అందుకే కేసీఆర్ తాగుబోతులను ప్రోత్సహిస్తున్నారు: టీడీపీ మహిళా నేత శోభారాణి
తెలంగాణలో చీప్ లిక్కర్ ను తీసుకురాబోతున్న సీఎం కేసీఆర్ పై టీడీపీ మహిళా నేత శోభారాణి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తాగుబోతు కాబట్టే తాగుబోతులను ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక మంత్రులు చీప్ లిక్కర్ బాటిళ్లు పట్టుకుని బ్రాండ్ అంబాసిడర్లలా వ్యవహరించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో చీప్ లిక్కర్ ను ఉపసంహరించుకోకపోతే తాము చీపుర్లు పట్టుకోవాల్సి వస్తుందని విమర్శించారు. చీప్ లిక్కర్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని, వచ్చే నెల 1, 2 తేదీల్లో చీప్ లిక్కర్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని శోభారాణి తెలిపారు.