: రసాభాసగా మారిన వైకాపా సమావేశం... కుర్చీలతో దాడులు


వైఎస్సార్సీపీ సమన్వయకమిటీ సమావేశం రసాభాసగా మారింది. అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గంలో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. విచక్షణ మరిచి కుర్చీలతో కొట్టుకున్నారు. పార్టీకి చెందిన కార్యక్రమాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఒక వర్గం మరో వర్గంపై ఆరోపణలు గుప్పించింది. ఈ క్రమంలోనే గొడవ చెలరేగింది. ఈ దాడుల్లో పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News