: బ్యాడ్మింటన్ రాకెట్లు చేతబట్టిన టీమిండియా ఆటగాళ్లు... 'టుక్-టుక్' లో భజ్జీ విహారం
కొలంబో టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా ఆటగాళ్లు సిరీస్ ఫలితం నిర్ణయించే మూడో టెస్టు కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో, బ్యాట్లు పక్కనబెట్టి బ్యాడ్మింటన్ రాకెట్లు అందుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా కొందరు ఆటగాళ్లు బ్యాడ్మింటన్ ఆటను ఆస్వాదించారు. కోహ్లీ, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఛటేశ్వర్ పుజారా బ్యాడ్మింటన్ కోర్టులో ఉత్సాహంగా ఆడుతున్న ఫొటోను బీసీసీఐ ట్విట్టర్లో పెట్టగా, జట్టు అధికారిక ఫేస్ బుక్ పేజీలోనూ బ్యాడ్మింటన్ ఫొటో దర్శనమిచ్చింది. అటు, హర్భజన్ సింగ్... సహచరులు కోహ్లీ, స్టూవర్ట్ బిన్నీలతో కలిసి కొలంబో నగరంలో 'టుక్-టుక్' లో విహరిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. శ్రీలంకలో ఆటోలను 'టుక్-టుక్'లంటారు.