: మార్కెట్లో టీవీఎస్ కొత్త స్కూటీ 'జూపిటర్ జడ్ ఎక్స్', ధర ఎంతంటే..!

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ తాజాగా మరో కొత్త వాహనాన్ని విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 'జూపిటర్' వేరియంట్ కు సరికొత్త హంగులు జోడించి 'జూపిటర్ జెడ్ ఎక్స్' పేరిట లిమిటెడ్ ఎడిషన్ గా దీన్ని విడుదల చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. దీని ధర రూ. 52,426 (ఎక్స్ షోరూం, ముంబై) అని వివరించింది. జూపిటర్ ను మార్కెట్లోకి విడుదల చేసిన తరువాత ఇప్పటివరకూ 5 లక్షల యూనిట్లను విక్రయించినట్టు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి వివరించారు. జూపిటర్ కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా, కొత్త గ్రాఫిక్స్, ట్యూబ్ లెస్ టైర్లు, సైడ్ ల్యాంప్స్ తదితరాల్లో మార్పులు చేర్పులు చేసినట్టు తెలిపారు.