: 'స్టార్ ఇండియా' మాజీ చీఫ్ భార్య కేసులో కీలక మలుపు


సోదరి హత్య కేసులో 'స్టార్ ఇండియా' మీడియా సంస్థ మాజీ చీఫ్ భార్య ఇంద్రాణి ముఖర్జియాను ముంబయి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. హత్యకు గురైన షీనా బోరా ఆమె సోదరి కాదని సొంత కుమార్తె అని పోలీసుల విచారణలో వెల్లడైంది. ముఖర్జియా డ్రైవర్ సమాచారం మేరకు ఇంద్రాణిని అదుపులోకి తీసుకున్నప్పుడు షీనా ఆమె సోదరి అని పొరపాటుబడ్డారు. కానీ ఈ రోజు ఇంద్రాణిని కొన్ని గంటలపాటు విచారించిన పోలీసులు కూతురు షీనా గురించి కూడా ప్రశ్నించారు. కొంతకాలం నుంచి ఆమె కనిపించడం లేదని చెప్పింది. అయితే అప్పటి నుంచి పోలీసులకు ఫిర్యాదు కూడా రాకపోవడంతో చనిపోయింది ఇంద్రాణి కూతురని పోలీసులు ఇప్పుడు నిర్ధారణకు వచ్చారు. హత్య ఘటన గురించి తెలిసిన ఆమె భర్త, స్టార్ ఇండియా మాజీ చీఫ్ పీటర్ ముఖర్జియా షాక్ తిన్నారు. ఇంద్రాణికి మొదటి భర్త ద్వారా షీనా బోరా జన్మించింది. 2012లో ఆమె అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

  • Loading...

More Telugu News