: చైనా తుమ్మిందంటే... ప్రపంచానికి జలుబు చేస్తుందట!


చైనాలో ఆర్థిక ఒడిదుడుకులు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను పేకమేడలా కూల్చేశాయి. పటిష్టమైన భారత మార్కెట్ కూడా ఆటుపోట్లకు గురికాక తప్పలేదు. అగ్రరాజ్యం అమెరికా కూడా ‘డ్రాగన్’ ఎఫెక్ట్ పై ఆందోళనతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఈ పరిణామాలపై చైనా అధికారిక వార్తా సంస్థ ‘జిన్హువా’ ఆసక్తికర వ్యాఖ్య చేసింది. చైనా తుమ్మిందంటే ప్రపంచానికి జలుబు చేసినట్టేనని ఆ సంస్థ చేసిన వ్యాఖ్య కలకలం రేపుతోంది. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలతో ముడిపడి ఉందన్న భావనతో ఆ వార్తా సంస్థ ఈ వ్యాఖ్య చేసింది. అంతేకాక ‘చైనా విచారం వ్యక్తం చేస్తే ప్రపంచానికి అనారోగ్యం తప్పదు’ అని కూడా ఆ వార్తా సంస్థ మరో వ్యాఖ్య కూడా చేసింది.

  • Loading...

More Telugu News