: ఓ పాట కోసం 24 గంటల పాటు 'లిప్ కిస్'లో ఉండిపోయిన కంగనా రౌనత్, ఇమ్రాన్ ఖాన్


నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ చిత్రం 'కట్టి బట్టి'లో ఓ పాట కోసం రోజుకు 8 గంటల చొప్పున మూడు రోజుల పాటు కంగనా రౌనత్, ఇమ్రాన్ ఖాన్ లు పెదవులు కలిపారట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. 'లిప్ టు లిప్ కిస్సియాన్' అనే పాట చిత్రీకరణను ఇండియాలో తొలిసారిగా స్టాప్ మోషన్ టెక్నాలజీలో చిత్రీకరించామని, హీరో హీరోయిన్లు ఈ పాటలో చాలా ప్రొఫెషనల్స్ గా నటించారని ఒక ప్రకటనలో వివరించారు. ఈ పాట చాలా బాగా వచ్చిందని తెలియజేశారు. రొమాంటిక్ కామెడీతో పాటు మిస్టరీ, లవ్ చిత్రంలో ప్రధానాంశాలని తెలిపారు. కాగా, ఈ చిత్రం వచ్చే నెల 18న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News