: జమ్మూ కాశ్మీర్ లో రాహుల్ పర్యటన... కాల్పుల బాధిత కుటుంబాలకు పరామర్శ


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు నుంచి జమ్ముూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన ఉంటుంది. సరిహద్దు కాల్పుల్లో గాయపడిన, చనిపోయిన పౌరుల కుటుంబాలను రాహుల్ పరామర్శిస్తారు. ఇప్పటికే పూంఛ్ జిల్లాలోని బల్ కోట్ ప్రాంతంలో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం అక్కడి స్థానికులతో సమావేశమై మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఆరుగురు పాక్ కాల్పులకు బలయ్యారు. తరువాత జమ్మూ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పంచాయతీ సర్పంచ్ లతో ఆయన భేటీ అయి ప్రసంగిస్తారు. లడక్ లోనూ రాహుల్ పర్యటిస్తారని తెలిసింది. ఈ పర్యటనలో రాహుల్ వెంట ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గులాం అహ్మద్ మిర్, ఇతర సీనియర్ పార్టీ నేతలు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News