: దోచుకోవడం, దాచుకోవడమే జగన్ నైజం... ధర్నా చేసే హక్కు లేదన్న టీడీపీ మహిళా కార్యకర్త


నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమి కోసం ఏపీ సర్కారు జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షకు పోటీగా టీడీపీ కూడా ప్రతి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అసలు రాజధాని భూసేకరణకు నిరసనగా జగన్ కు దీక్ష చేసే అర్హతే లేదని ప్రతి దీక్షలో కూర్చున్న టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు వ్యాఖ్యానించారు. ఓ ప్రైవేట్ టీవీ చానెల్ తో మాట్లాడిన సందర్భంగా ఆమె జగన్ వైఖరిపై నిప్పులు చెరిగారు. దోచుకోవడం, దాచుకోవడమే జగన్ నైజమని ఆరోపించిన ఆమె, దీక్ష చేసే నైతిక హక్కు జగన్ కు లేదని తేల్చిచెప్పారు. అయినా జగన్ చెబుతున్నట్లు రాజధాని రైతులు బాధలో లేరన్న ఆమె, ఏపీ సర్కారు ప్రకటించిన ప్యాకేజీతో సంతోషంగా ఉన్నారన్నారు. జగన్ ఒంటరిగా వస్తే తాను నిరూపిస్తానని కూడా ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News