: జరిగిన దానికి చింతిస్తున్నాం: జపాన్ ప్రధానికి ఒబామా ఫోన్


జపాన్ నేతలపై అమెరికా గూఢచర్యం జరిపినట్టు వికీలీక్స్ బహిర్గతం చేసిన పత్రాలపై, జపాన్ ప్రజలు మండిపడుతుంటే, బరాక్ ఒబామా విచారం వ్యక్తం చేశారు. బుధవారం నాడు జపాన్ ప్రధాని షింజో అబేతో ఒబామా ఫోన్లో మాట్లాడారని జపాన్ అధికార ప్రతినిధి యోషిహిడే సుగా తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న కష్టాలపై, చైనా కరెన్సీ ప్రభావంపై ఇరు దేశాలూ కలసి పోరాడాలని నేతలు నిర్ణయించారని సుగా వివరించారు. "వికీలీక్స్ కథనం తరువాత జపాన్ లో నెలకొన్న చర్చ, ప్రజల మనోభావాలు దెబ్బతినడంపై అధ్యక్షుడు చింతిస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో గూఢచర్యం తీవ్రమైనదని షింజో అబే తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ తరహా వార్తలు ఇరు దేశాల మధ్యా సత్సంబంధాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆయన అన్నారు" అని సుగా తెలియజేశారు. కాగా, యూఎస్ నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ, సంవత్సరాలుగా జపాన్ అధికారులు, పెద్ద పెద్ద కంపెనీలపై గూఢచర్యం చేస్తోందని గత నెలలో వికీలీక్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News