: కృష్ణా జలాల వివాదంపై కేంద్రం వైఖరి కోరిన సుప్రీంకోర్టు
కృష్ణానదీ జలాల వివాదంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జలాలపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఏపీకి కేటాయించిన నీటిలోనే వాటా అడగాలని తెలంగాణ రాష్ట్రానికి కోర్టు సూచించింది. ఈ సమయంలో తెలంగాణ పిటిషన్ ఆధారంగా కేంద్రానికి నోటీసులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అయితే కృష్ణా జలాల వివాదంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలని సుప్రీం కోరింది. పిటిషన్లపై తదుపరి విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. తెలంగాణ తరపున న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు.