: దుబాయ్ లో గాయపడ్డ డింపుల్ కపాడియా


అలనాటి అందాల నటి డింపుల్ కపాడియా గాయపడింది. దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న 'వెల్ కం బ్యాక్' సినిమా షూటింగ్ స్పాట్ లో ఈ ప్రమాదం సంభవించింది. ఓ ఫన్నీ సీన్ సందర్భంగా, భారీగా ఉన్న గాగ్రాను ధరించిన ఆమె... వేగంగా పరుగెత్తుతూ ఓ డైలాగ్ చెప్పాల్సి ఉంది. ఈ క్రమంలో, భారీ గాగ్రా వల్ల ఆమె బ్యాలెన్స్ తప్పి, కంట్రోల్ కోల్పోయి, కిందకు పడిపోయింది. దీంతో, ఆమె గాయపడింది. వెంటనే ఆమెకు చికిత్సను అందించారు. అయితే, కొద్ది రోజుల పాటు షూటింగ్ కు దూరంగా ఉండి, రెస్ట్ తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు. ఈ సినిమాలో డింపుల్ కపాడియాతో పాటు అనిల్ కపూర్, నానా పటేకర్, జాన్ అబ్రహం, పరేష్ రావల్, శ్రుతిహసన్ నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News