: అక్రమ సంబంధాలు నడిపేవారిలో ఢిల్లీ వాసులు అధికం... ఐదో స్థానంలో హైదరాబాదీలు


అక్రమ సంబంధాల వెబ్ సైట్ ఆష్లే మాడిసన్ లో రిజిస్టర్ చేసుకున్న వారి వివరాలు బహిర్గతం కావడంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వెబ్ సైట్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉండగా, సుమారు లక్షన్నర మందికి పైగా భారతీయులు ఈ సైట్ మాధ్యమంగా అక్రమ సంబంధాలు నడుపుతున్నారు. ఈ వెబ్ సైట్ లోని డేటాను 'టెక్నలాజికా' అనే సంస్థ బహిర్గతం చేసింది. ఈ గణాంకాల ప్రకారం అక్రమ సంబంధాలు నడుపుతున్న వారిలో ఢిల్లీ వాసులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఢిల్లీకి చెందిన 38,620 మంది ఆష్లే మాడిసన్ లో సభ్యులుగా ఉండగా, తరువాతి స్థానాన్ని 32,888 సభ్యులతో ముంబై ఆక్రమించింది. చెన్నైకి చెందిన 16,355 మంది, బెంగళూరుకు చెందిన 16,267 మంది, హైదరాబాద్ కు చెందిన 12,548 మంది, కోల్ కతాకు చెందిన 11,751 మంది, పుణెకు చెందిన 9,738 మంది సభ్యులుగా ఉన్నారు. వెబ్ సైట్ కు 30 కోట్ల మంది వరకూ రిజిస్టర్డ్ సభ్యులుండగా, వారిలో అత్యధికుల ప్రైవేట్ చిత్రాలు, వారి ఈ-మెయిల్ ఐడీలు తమ వద్ద ఉన్నాయని హ్యాకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు హ్యాక్ చేసిన సమాచారంలో కొందరి వివరాలు బయటకు వెల్లడించగా, పరువు పోయిందన్న మనస్తాపంతో కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News