: సంజయ్ దత్ కు మూడు నెలల పాటు జైలు నుంచి విముక్తి!


బాలీవుడ్ నటుడు, ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న సంజయ్ దత్ కు మరోమారు పెరోల్ లభించింది. కుమార్తె అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ, తనకు పెరోల్ మంజూరు చేయాలని జూన్ నెలలో ఆయన దరఖాస్తు చేసుకోగా, విచారణ జరిపిన అధికారులు ఆయనకు 30 రోజుల పెరోల్ ను మంజూరు చేశారు. ఫార్మాలిటీస్ పూర్తయిన తరువాత మరో రెండు రోజుల్లో సంజయ్ జైలు నుంచి బయటకు రావచ్చని తెలుస్తోంది. కాగా, అధికారులు 30 రోజుల పెరోల్ మంజూరు చేసినప్పటికీ, దీన్ని గరిష్ఠంగా మరో 60 రోజుల పాటు పొడిగించుకునే సదుపాయం ఉంది. దీంతో ఈ దఫా సంజయ్ మూడు నెలల పాటు బయట ఉంటాడని తెలుస్తోంది. మే 2013లో ఆయనకు జైలు శిక్ష పడ్డప్పటి నుంచి 146 రోజులు బయటే ఉన్నాడు. అక్టోబర్ 2013లో పెరోల్ పై బయటకు వచ్చిన ఆయనకు 14 రోజుల పొడిగింపు లభించగా, తిరిగి జనవరి 2014లో 30 రోజుల పెరోల్ పై బయటకు వచ్చి దాన్ని మరో 60 రోజులకు పొడిగించుకోగలిగాడు. డిసెంబర్ లో మరో పెరోల్ లభించినా, దేశవ్యాప్తంగా విమర్శలు పెరగడంతో దాన్ని మాత్రం పొడిగించలేదు.

  • Loading...

More Telugu News