: ఆర్డరిచ్చిన గంటలోగా ఇంటికే మద్యం... అమెజాన్ సరికొత్త సేవలకు సూపర్ రెస్పాన్స్!


ఆర్డర్ చేసిన గంటలోగా ఇంటికే మద్యం వెరైటీలు అందిస్తామని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చేసిన ప్రకటనకు బ్రహ్మండమైన ఆదరణ లభించింది. 'ప్రైం నౌ సర్వీస్' పేరిట అమెజాన్ సంస్థ అమెరికాలో ఈ సేవలను ప్రారంభించగా, క్షణాల్లో ఆర్డర్లు వందల నుంచి వేలకు చేరిపోయాయి. ఆన్ లైన్లో మద్యం కొనుగోలు చేసే వారి సంఖ్య అమాంతం పెరిగిందని సంస్థ ప్రకటించింది. కస్టమర్లకు అన్ని రకాల సేవలనూ దగ్గర చేయాలన్నదే తమ లక్ష్యమని, అందులో భాగంగానే ఈ వినూత్న ఆలోచన చేశామని వెల్లడించారు. సాధ్యమైనంత త్వరలో 'ప్రైం నౌ సర్వీస్'ను మరిన్ని దేశాలకు విస్తరిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News