: శ్రావణ లక్ష్మికి బంగారంతో స్వాగతం పలకాల్సిందే... ధరలు పెరిగినా, జోరుగా వ్యాపారం


మరో రెండు రోజుల్లో వరలక్ష్మీ వ్రతం. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పర్వదినం. ఆ రోజున లక్ష్మీదేవిని కొత్త బంగారంతో పూజిస్తే శుభం కలుగుతుందని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇదే బంగారం వ్యాపారుల పాలిట వరమైంది. రెండు వారాల క్రితం రూ. 2,400 దగ్గర కదలాడిన గ్రాము బంగారం ధర, ఇప్పుడు రూ. 2,700కు చేరువైంది. ధరలు పెరిగినా, బంగారం వ్యాపారం జోరుగానే సాగుతోందని వ్యాపారులు సంబరపడుతున్నారు. కొంచమైనా బంగారం కొనాలని భావించే మహిళల సెంటిమెంటు వారిని ఆభరణాల దుకాణాల వైపు నడిపిస్తోంది. కొందరు పాత బంగారాన్ని మార్చి కొత్త బంగారంగా మార్చుకుంటున్నారని తెలుస్తోంది. శ్రావణమాసం విక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయని ముందే అంచనా వేసిన జ్యూయలర్స్, ఇటీవలి కాలంలో కొత్త స్టోర్స్ మొదలు పెట్టి, సరికొత్త వెరైటీలను అందుబాటులో ఉంచారు. దీంతో, ఆయా దుకాణాల్లో అతివల సందడితో శ్రావణ శోభ నెలకొంది.

  • Loading...

More Telugu News