: దావూద్ ను కరాచీలో రెండు సార్లు కలిశా... కుండబద్దలు కొట్టిన పాక్ జర్నలిస్ట్


అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడన్న పాకిస్థాన్ వాదనలో పస లేదని మరోమారు వెల్లడైంది. కరాచీలో ఉన్న దావూద్ ను తాను రెండుసార్లు నేరుగా కలిశానని ఆ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఆరిఫ్ జమాల్ ఈ మేరకు ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తున్న జమాల్ గతంలో ‘న్యూయార్క్ టైమ్స్’కు పాకిస్థాన్ లో కంట్రిబ్యూటర్ గా పనిచేశారు. కరాచీలో ఉన్న దావూద్ అతి కొద్ది మందిని మాత్రమే కలుస్తాడని జమాల్ తెలిపారు. ఇక దావూద్ పొరుగింటిలో అతడి సోదరుడు అనీస్ ఇబ్రహీం నివసిస్తున్నాడని కూడా ఆరిఫ్ జమాల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News