: 'స్టార్ ఇండియా' మాజీ చీఫ్ భార్య ఇంద్రాణి అరెస్ట్
'స్టార్ ఇండియా' మీడియా సంస్థ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జియా సతీమణి ఇంద్రాణి ముఖర్జియాను ఓ హత్య కేసు విషయమై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె సోదరి షీనా బోరా 2012లో హత్యకు గురి కాగా, ఆమె మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో పోలీసులకు కనిపించింది. సంఘటనా స్థలం నుంచి ఆమె దేహాన్ని తరలించేందుకు ఇంద్రాణి సహాయపడ్డట్టు పోలీసులు తేల్చారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, ఈ నెల 31 వరకూ రిమాండ్ విధించారు. ఇంద్రాణి ఇంట్లోని డ్రైవరును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.