: ఆస్ట్రేలియాలో ఇండియన్ రెస్టారెంట్ పై కాల్పులు
ఆస్ట్రేలియాలోని సిడ్నీ సమీపంలో ఉన్న 'ఇండియన్ ఈటర్ యాన్' అనే రెస్టారెంట్ పై దుండగుడు తెగబడ్డాడు. రెస్టారెంట్ రద్దీగా ఉన్న సమయంలో కిటికీలో నుంచి కాల్పులు జరిపాడు. ఇటీవలి కాలంలో భారతీయులే లక్ష్యంగా దాడి జరగడం ఇది రెండోసారి. నీలి రంగు దుస్తులు ధరించి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. అనంతరం పారిపోయాడు. కాగా, ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.