: చిత్తూరు జిల్లాలో డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్... చిట్టీల వ్యాపారంలో తండ్రికున్న వివాదాలే కారణమా?


చిత్తూరు జిల్లాలో కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఓ డిగ్రీ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. చిట్టీల వ్యాపారానికి సంబంధించి బాధితురాలి తండ్రికి, మరో వ్యక్తికి మధ్య తలెత్తిన విభేదాలే ఈ కిడ్నాప్ కు కారణమై ఉంటుందన్న అనుమానాలతో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వివరాల్లోకెళితే బంగారుపాళ్యం మండలం పాలమాకులపల్లికి చెందిన లౌకిక అనే విద్యార్థిని ఐదు రోజుల క్రితం కాలేజీకని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా తొలుత పట్టించుకోలేదు. తాజాగా మీడియాలో కిడ్నాప్ నకు సంబంధించిన వార్తలు రావడంతో ఆగమేఘాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలి తండ్రి రవికి, అదే గ్రామానికి చెందిన బాషా అనే వ్యక్తికి మధ్య చిట్టీల వ్యాపారానికి సంబంధించి వివాదం నడుస్తోందని, ఈ నేపథ్యంలో బాషానే విద్యార్థిని కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. విద్యార్థిని తండ్రి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News