: సిక్కోలులో కంపించిన భూమి... పరుగులు పెట్టిన ప్రజలు
రాష్ట్ర విభజనతో పలు రకాల ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీని భూకంపాలు నిద్ర పోనివ్వడం లేదు. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుమార్లు స్వల్ప భూకంపాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న నేపాల్ భూకంపాల సమయంలో రాయలసీమ మినహా మొత్తం ఏపీలోని అన్ని జిల్లాల్లో నమోదైన భూప్రకంపనలు జనాన్ని పరుగులు పెట్టించాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. జిల్లాలోని సోంపేట, మందస, ఉద్ధానం, కంచిలి, పలాస తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఉన్నట్లుండి భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.