: కేసీఆర్ బస్సుకు ఎంట్రీ ట్యాక్స్ రూ.37 లక్షలు మినహాయింపు!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లాల్లో పర్యటించేందుకు కొత్తగా కొనుగోలు చేసిన బస్సుకు ఎంట్రీ ట్యాక్స్ మినహాయింపు లభించింది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటు కేసీఆర్ కూడా తన జిల్లా పర్యటనల కోసం దాదాపు రూ. 5 కోట్లు వెచ్చించి బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన ఈ బస్సుకు వాస్తవానికి ఎంట్రీ లెవీ ట్యాక్స్ కింద రూ. 37,66,829 మేర చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఈ ట్యాక్స్ ను మినహాయిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.