: ముంబైలో కల్వకుంట్ల కవిత... మంజీరా నీటిపై ‘మహా’ సీఎంతో భేటీ!


మంజీరా నీటి విషయంపై మహారాష్ట్ర, తెలంగాణల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగారు. నిజామాబాదు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులతో కలిసి నిన్న ముంబై వెళ్లిన కవిత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ కు కవిత రెండు వినతి పత్రాలను అందజేశారు. మంజీరా నదికి సంబంధించి సరిహద్దు సమస్యల పరిష్కారానికి జియోగ్రాఫికల్ సర్వే నిర్వహించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. అంతేకాక ఇసుక రవాణా వివాదాల పరిష్కారంపైనా దృష్టి సారించాలని విన్నవించారు. ఇక తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని, తమ ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కూడా ఆమె ఫడ్నవీస్ ను కోరారు.

  • Loading...

More Telugu News