: పేదలను ఉద్ధరించేందుకే చీప్ లిక్కర్: కేసీఆర్
గుడుంబాతో పేద ప్రజల ప్రాణాలు పోగొట్టుకోరాదనే చీప్ లిక్కర్ ను తెచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ చీప్ లిక్కర్ ను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. గుడుంబాను అరికట్టేందుకు చీప్ లిక్కరే సరైన పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల ప్రచారానికి ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని ఆయన పిలుపునిచ్చారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని ఆయన పేర్కొన్నారు.