: రాజకీయ మైలేజీ కోసమే కేసు పెట్టిందంటున్న వేధింపుల యువకుడు!
ఢిల్లీలోని ఓ రోడ్డుపై సిగ్నల్ దగ్గర జస్లీన్ కౌర్ (20) అనే యువతిని సరబ్ జీత్ సింగ్ (26) అనే యువకుడు వేధించగా, ఆ యువతి అతని ఫోటో తీసి ఫేస్ బుక్ లో జరిగిన కథ వివరించి, పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిని బెయిల్ పై విడుదల చేశారు. అనంతరం అతను మాట్లాడుతూ, జస్లీన్ కౌర్ ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యురాలని, రాజకీయ మైలేజీ కోసం తనపై లేనిపోని ఆరోపణలతో కేసు పెట్టిందని విమర్శించాడు. తనకున్న రాజకీయ పలుకుబడిని ఆ యువతి ఈ విధంగా దుర్వినియోగం చేస్తోందని సరబ్ జీత్ సింగ్ తల్లి వ్యాఖ్యానించడం గమనార్హం!