: సెప్టెంబర్ మొదటి వారంలోగా డీఎస్సీ నియామకాలు: గంటా
సెప్టెంబర్ మొదటి వారంలోగా డీఎస్సీ నియామకాలు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ మొదటి వారంలోపు ఫలితాల ప్రకటనతో పాటు, నియామకాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల అజెండాలో చెప్పినట్టే డీఎస్సీ నియామకాలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. డీఎస్సీ 'కీ'లో తప్పుల గురించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలో తప్పులపై సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కమిటీ వేసి విచారిస్తామని ఆయన తెలిపారు. తప్పులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.