: పడుకుందా?...పది రోజులైనా లేవదు!


రామాయణంలో కుంభకర్ణుడు గురించి అంతా విన్నాం... ఆరు నెలలు నిద్రపోతాడని! ఇంతిలా కాకపోయినా కాస్త అటు ఇటుగా, ఇలాంటి నిద్ర కేసే ఒకటి ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది. అడిలైడ్ కు చెందిన జార్జియా గ్రీన్ (19) ను అరుదైన వ్యాధి పీడిస్తోంది. ఈ వ్యాధి కారణంగా స్కూల్, కళాశాల విద్యను కోల్పోయానని, స్నేహితులు, బంధువులను కూడా కోల్పోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. క్లెయిన్-లావిన్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో జార్జియా బాధపడుతోంది. పది లక్షల మందిలో ఒకరికి సోకే ఈ వ్యాధి జార్జియాను సోకింది. ఓ రోజు అందర్లా నిద్రపోయిన జార్జియా పది రోజులపాటు లేవలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు అరుదైన క్లెయిన్-లావిన్ సిండ్రోమ్ సోకిందని తెలిపారు. ఈ వ్యాధి కారణంగా పదిరోజుల పాటు నిర్విరామంగా నిద్రపోతారని, దీనిని నయం చేయలేమని స్పష్టం చేశారు. 30 ఏళ్ల వరకు జార్జియాకు ఇలాగే ఉంటుందని, తరువాత వ్యాధి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి కారణంగా జార్జియా స్కూల్ లో పరీక్షలు రాయలేకపోయింది. దీంతో వారు స్కూలు నుంచి తొలగించారు. పది రోజుల నిద్రవల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నానని జార్జియా గ్రీన్ బాధపడుతోంది.

  • Loading...

More Telugu News