: లిక్కరుతో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమో చెప్పాలి: కిషన్ రెడ్డి


లిక్కరుతో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో ఆయన మాట్లాడుతూ, లిక్కర్ ను రాష్ట్ర ప్రజలు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నా...నూతన మద్యవిధానం పేరిట చీప్ లిక్కర్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. మద్యం కారణంగా ఏర్పడుతున్న పరిణామాలను నిత్యం చూస్తున్న ప్రభుత్వం ఎందుకు లిక్కర్ ప్రవేశపెట్టాలనుకుంటోందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లిక్కర్ తో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందా? అని ఆయన అడిగారు.

  • Loading...

More Telugu News