: పాక్ తో ఆడాలని భారత్ ను ఐసీసీ ఒత్తిడి చేయదు: లాహోర్ లో ఐసీసీ ఛైర్మన్


పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలని భారత్ ను ఐసీసీ ఒత్తిడి చేయబోదని ఐసీసీ ఛైర్మన్ జహీర్ అబ్బాస్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ లోని లాహోర్ లో ఆయన మాట్లాడుతూ, క్రికెట్ ఆడాలని ఏ రెండు దేశాల క్రికెట్ బోర్డులను ఐసీసీ బలవంతం చేయదని తెలిపారు. ఆడాలో... వద్దో... భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులే తేల్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కాగా, వచ్చే డిసెంబర్ లో యూఏఈ వేదికగా క్రికెట్ ఆడాలని బీసీసీఐ, పీసీబీ నిర్ణయించాయి. ఇంతలో రెండు దేశాల మధ్య చర్చలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య దౌత్య, రాజకీయ పరమైన సమస్యలు పరిష్కారం కాకుండా, సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదులు భారత సైనికులను హత్య చేస్తుంటే క్రికెట్ ఎలా ఆడతామంటూ బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కాగా, భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ నవంబర్ లో జరిగే అవకాశం ఉందంటూ పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News