: భగత్ సింగ్ ను ఉగ్రవాదులతో పోల్చిన వేర్పాటు వాది షబ్బీర్ షా
వేర్పాటు వాది షబ్బీర్ షా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ను ఉగ్రవాదులతో పోల్చి అవమానించారు. జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో ఆయన మాట్లాడుతూ, భగత్ సింగ్ మాదిరిగా కాశ్మీర్ ఉగ్రవాదులు గొప్ప కార్యం కోసం పోరాడుతున్నారని అన్నారు. ఉగ్రవాదులు దేశభక్తులు, హీరోలని షబ్బీర్ షా కొనియాడారు. కాగా, ఆయన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బానిస సంకెళ్ల నుంచి భరతమాతను విముక్తం చేయడానికి త్యాగం చేసిన భగత్ సింగ్ తో అమాయక ప్రజలను, సైనికులను పొట్టనబెట్టుకుంటున్న తీవ్రవాదులకు పోలిక ఏంటని, ఆ వ్యాఖ్యలపై షబ్బీర్ షా తక్షణం క్షమాపణలు చెప్పాలని దేశ భక్తులు డిమాండ్ చేస్తున్నారు.