: హిందూపురాన్ని పారిశ్రామిక ప్రాంతంగా మారుస్తాం: బాలకృష్ణ


హిందూపురాన్ని పారిశ్రామిక ప్రాంతంగా మారుస్తామని సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు హైవేను హిందూపురంతో అనుసంధానానికి ప్రతిపాదన ఇచ్చామని చెప్పారు. రహదారుల అభివృద్ధికి ఇంకా నిధులు విడుదల కావాల్సి ఉందని సచివాలయంలో మంత్రి అయ్యన్న పాత్రుడుతో సమావేశం తరువాత బాలయ్య అన్నారు. బాలయ్య ఎమ్మెల్యే అయ్యాక ప్రజల సమస్యలపై బాగా స్పందిస్తున్నారని మంత్రి అయ్యన్న ప్రశంసించారు. హిందూపురం రహదారుల అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. తప్పనిసరి కాబట్టే రాజధానికి భూసేకరణ చేస్తున్నామని చెప్పారు. భూసేకరణపై పవన్, జగన్ చెప్పేదానికి చాలా తేడా ఉందని అభిప్రాయపడ్డారు. పవన్ చర్చల ద్వారా భూములు తీసుకోవాలని చెబుతుంటే, జగన్ అసలు భూములే వద్దంటున్నారని పేర్కొన్నారు. అలాగయితే రాజధానిని ఆకాశంలో కట్టే వెసులుబాటు ఉంటే జగన్ చెప్పాలని మంత్రి ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News