: టెన్నిస్ కోర్టును వదిలేసి రోడ్డెక్కిన దిగ్గజాలు


కోర్టును వదిలేసి టెన్నిస్ అగ్ర క్రీడాకారులంతా రోడ్డెక్కారు. టెన్నిస్ ఆడాలంటే గ్రాస్ కోర్టు లేక క్లే కోర్టు కానీ కావాలి. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఆడుతామంటే కుదరదు. కానీ టెన్నిస్ దిగ్గజాలు సెరేనా విలియమ్స్, మారియా షరపోవా, రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, ఆండ్రీ అగస్సీ, జాన్ మెకెన్రో నడి రోడ్డుపై టెన్నిస్ ఆడి అభిమానులను అలరించారు. ప్రముఖ పాదరక్షల ఉత్పత్తి సంస్థ నైకీ, స్ట్రీట్ ఈవెంట్ లో భాగంగా అమెరికా న్యూయార్క్ లోని గ్రీన్ విచ్ విలేజ్ లోని నడి రోడ్డుపై ప్రముఖ క్రీడాకారులతో స్ట్రీట్ టెన్నిస్ ఆడించింది. నైకీ సంస్థ ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ ను భారీ సంఖ్యలో గుమికూడిన స్థానికులు బాగా ఎంజాయ్ చేశారు. కాగా, వీరంతా నైకీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఆయాదేశాల్లో వ్యవహరిస్తున్నారు. వీరితో ఎండార్స్ మెంట్ కుదుర్చుకున్న నైకీ సంస్థ వినూత్నంగా దీనిని ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News