: బాధలో ఉన్నారా?...అయితే, మనసారా ఏడవడమే మేలు!


బాధలో ఉన్నప్పుడు స్త్రీలు, పురుషులు వేర్వేరుగా స్పందిస్తారు. సాధారణంగా బాధలో ఉంటే స్త్రీలు ఏడ్చేస్తారు. పురుషులు మాత్రం బాధను బయపెట్టకుండా లోలోపలే దిగమింగుతారు. బాధ కలిగితే దానిని బయటపెట్టడానికి ఏడ్వడమే సరైన విధానమని పరిశోధకులు చెబుతున్నారు. నెదర్లాండ్స్ లోని టిల్ బర్గ్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు బాధలో స్పందనలపై పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనలో భాగంగా 60 మందికి బాధ కలిగించే చిత్రాలను 90 నిమిషాలపాటు చూపించి వారిలో భావాలను పరిశీలించారు. బాధగా అనిపించిన కొంతమంది వెంటనే ఏడ్వగా, మరి కొందరు బాధను లోలోపలే దిగమింగుకున్నారు. వారిలో బాధతో ఏడ్చినవారు త్వరగా కోలుకోగా, బాధను లోలోపలే దిగమింగినవారు కోలుకోవడానికి బాగా సమయం పట్టిందని పరిశోధకులు తెలిపారు. బాధ ఎక్కువ సేపు మనసులో ఉండిపోతే, అది ఇతర పనులపై ప్రభావం చూపుతుందని, ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. బాధను మర్చిపోయేందుకు ఏడవడమే సరైన విధానమని వారు తెలిపారు. ఇకపై భరించలేని బాధ వస్తే పంటిబిగువున ఉగ్గబెట్టుకోకుండా ఏడ్వడమే మేలు అని గుర్తించండి అంటూ వారు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News