: అప్పటి ప్రధాని చెప్పింది నిజమే... అయినా ప్రత్యేక హోదా ఇవ్వలేము: జైట్లీ


ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదాను గట్టిగా కోరుతున్నారన్న విషయం తనకు తెలుసునని, విభజన బిల్లు ఆమోదం పొందే సమయంలో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నప్పటికీ, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అందుకు అనుగుణంగా లేవని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వలేమని ప్రత్యక్షంగా చెప్పకుండానే, ఇచ్చే ఉద్దేశం తమకు లేదన్నట్టు ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాకు బదులుగా, ప్రత్యేక ప్యాకేజీలతో ఏపీని ఆదుకుంటామని ఆయన అన్నారు. పారిశ్రామికంగా, మౌలిక వసతుల పరంగా, కొత్త రాజధాని నిర్మాణ పరంగా రాష్ట్రానికి అన్ని రకాల నిధులనూ ఇచ్చి ఆదుకునేందుకు తాము సిద్ధమేనని తెలిపారు. రాష్ట్రానికి ఏం దక్కిందన్నది, ఏం దక్కుతుందన్నది మాత్రమే చూడాలని ఆయన కోరారు. తాము ఏపీకి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలని అడిగిన మాట నిజమేనని, అయితే, రాజ్యాంగం ఒప్పుకోకుంటే ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. ఆ విషయమై ప్రశ్నలు వద్దని అన్నారు.

  • Loading...

More Telugu News